Pages

Tuesday 25 February 2014

తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు

ఎన్నో ఉద్యమాలు చేసి సాధించికున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వారికి ఎంతో విజయం మరియు  ఆనందదాయకం కావచ్చేమో! కాని అది ఇరు ప్రాంతాల వారికి win-win పరిస్థితులలో మాత్రం జరగలేదన్నది వాస్తవం.

కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం ఆశించి మాత్రమే ఈ విభజన చేసిందని తెలంగాణా వారు కూడా అంగీకరిస్తారు అనుకుంటున్నా. విభజన ప్రక్రియలో ఎటువంటి సమన్యాయం పాటించినట్టు కాని రెండు ప్రాంతాలకు ప్రయోజనం కలిగేలా బిల్లులో ఎటువంటి విషయాలను పొందుపరిచినట్టు కాని లేదు. అంటే నా ఉద్దేశ్యం వారు నోటి మాటగా మాత్రమే వెల్లడించారు. అది కూడ సోనియాగారు కంటితుడుపు చర్యగా ప్రత్యేక పేకేజి ప్రకటించమనగానే ఎల్లపుడు తల ఊపడానికే అలవాటుపడిన మన ఘనత వహించిన ప్రధానమంత్రిగారు ఎంతో ఉదారంగా ఐదు సంవత్సారాలు ప్రత్యేక హోదా కల్పిస్తునట్టు ప్రకటించారు.

ఈ బిల్లును వ్యతిరేకించడంలో మన పార్లమెంటరి మెంబర్స్‌గాని, ఎంఎల్ఏ కాని ఏ సందర్భంలో కూడా సరైన ప్రణాలికతో వ్యవహరించినట్టు కనిపించదు. అసలు వీరు అసెంబ్లిలోను, పార్లమెంటులోను మాట్లాడినతీరు చూస్తే అసలు వీరు వారి హోదాకు తగినట్టు  ఒక బాధ్యతగా ప్రవర్తించినట్టు కాని కనిపించదు. ఒకరికి ఉద్యోగం ఇవ్వలంటె సవాలక్ష వివరాలు పరిశీలించి వంద ప్రశ్నలు వేసిగాని ఖారారు చేయం. అలాంటిది ఒక ప్రాంత ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేసే ఇటువంటి విషయాలలో కూడా వీరితీరు చూస్తే ఎవరికి అయినా ప్రజలు ఎటువంటు అసమర్ధులను  ఎన్నుకుంటున్నారో తెలుస్తుంది. కనీసం వచ్చే ఎన్నికలలో అయినా అభ్యర్ధుల వివరాలు సమస్తం తెలుస్కొని ప్రజలు వారి అమూల్యమైన ఓటు వేసేటపుడు అయినా అలోచించే చెతైన్యం పొందాలని ఆశిస్తున్నాను.


గమనిక: ఇది ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదని, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు. 

No comments:

Post a Comment